Ap News: ఏపీలో మూడు వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌లో మూడు కొత్త వైద్య కళాశాలలకు కేంద్రం ఆమోదం తెలిపింది. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. రాష్ట్రంలోని

Updated : 14 Dec 2021 16:56 IST

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో మూడు కొత్త వైద్య కళాశాలలకు కేంద్రం ఆమోదం తెలిపింది. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. రాష్ట్రంలోని పిడుగురాళ్ల, పాడేరు, మచిలీపట్నంలో కొత్త వైద్య కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ‘‘ఏపీలో ఇప్పటికే 13 వైద్య కళాశాలలు ఉన్నాయి. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద కళాశాలలు అభివృద్ధి చేస్తాం. తిరుపతి శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌, విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాల, అనంతపురం వైద్య కళాశాలలు అభివృద్ధి చేస్తాం’’ అని కేంద్రం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు