JNV: ఆగస్టు 31 నుంచి ‘నవోదయ’లో తరగతులు పునఃప్రారంభం

జవహర్‌ నవోదయ విద్యాలయాలు తెరవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 31వ తేదీ నుంచి జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో తరగతులు నిర్వహించనున్నట్లు

Published : 28 Aug 2021 02:07 IST

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గడంతో దశల వారీగా తరగతులు నిర్వహించేందుకు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జవహర్‌ నవోదయ విద్యాలయ సమితి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31నుంచి దశల వారీగా తరగతులు పునఃప్రారంభించనున్నట్టు వెల్లడించింది. తొలుత 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు 50శాతం సిటింగ్‌ సామర్థ్యంతో తరగతులు నిర్వహించనుంది. ఈ నెల 31 నుంచి విద్యార్థులు తరగతులకు హాజరు కావడంతో పాటు తల్లిదండ్రుల సమ్మతితో హాస్టళ్లలో కూడా ఉండేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు కేంద్ర విద్యాశాఖ తెలిపింది. కొవిడ్‌ నిబంధనల మేరకు అన్ని చర్యలు తీసుకోనున్నారు. ఆన్‌లైన్‌ విద్యబోధన కూడా కొనసాగుతుందని అధికారులు స్పష్టంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని