Ap News: వరదలతో కడప జిల్లాకు భారీ నష్టం: సీఎం జగన్‌కు వివరణ ఇచ్చిన కేంద్ర బృందం

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం ఏపీ సీఎం జగన్‌తో ఇవాళ భేటీ అయ్యింది. వరద

Published : 29 Nov 2021 15:36 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం ఏపీ సీఎం జగన్‌తో ఇవాళ భేటీ అయ్యింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని గురించి సీఎం జగన్‌కు బృందం వివరించింది. వరద ప్రభావిత జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్ర బృందం ప్రశంసించింది. కేంద్ర బృందం తరఫున కునాల్‌ సత్యార్థి సీఎం జగన్‌కు వివరాలు వెల్లడించారు.

‘‘వరద ప్రభావిత ప్రాంతాల్లో మూడు రోజులు పర్యటించాం. వరదల వల్ల కడప జిల్లాకు భారీ నష్టం కలిగింది. పెద్ద ఎత్తున పంటలు కొట్టుకుపోయాయి. పశువులు చనిపోయాయి. అన్నమయ్య ప్రాజెక్టు తెగిన చోట అపార నష్టం వాటిల్లింది. వరద నష్టంలో 40 శాతం రోడ్లు, భవనాలు ధ్వంసం అయ్యాయి. 32 శాతం సాగు, అనుబంధ రంగాల్లో నష్టం జరిగింది. వీలైనంత మేర ఆదుకొనేందుకు సహకారం అందిస్తాం’’ అని కునాల్‌ వెల్లడించారు. వరద నష్టా్న్ని అంచనా వేసేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందానికి ఈ సందర్భంగా సీఎం జగన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

ధాన్యం కొనుగోలులో నిబంధనలు సడలించాలని సీఎం జగన్‌ ఈ సందర్భంగా కేంద్ర బృందాన్ని కోరారు. నష్టం అంచనాల తయారీకి క్షేత్రస్థాయిలో సమర్థ వ్యవస్థ ఉందన్నారు. ప్రతి గ్రామంలో ఆర్‌బీకే ఉందని.. రైతు పండించిన పంట ఈ-క్రాప్‌లో నమోదు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి రైతుకు పంట ఈ-క్రాప్‌ రసీదు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. విపత్తుల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత కాల్వల సామర్థ్యం పెంచేందుకు చర్యలు చేపట్టామని.. ఆటోమెటిక్‌ వాగర్‌ గేజ్‌ సిస్టంపైనా దృష్టి సారిస్తామని కేంద్ర బృందానికి సీఎం జగన్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని