Constituencies bifurcation: తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన అప్పుడే..

తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఏపీ, తెలంగాణలో 2031 తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని తెలిపింది...

Updated : 03 Aug 2021 14:14 IST

దిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఏపీ, తెలంగాణలో 2031 తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని తెలిపింది. ఈ మేరకు కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అడిగి ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. 2026 జనాభా లెక్కల ఆధారంగా రాజ్యాంగంలోని 170 అధికరణం ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపడతామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని