Chennamaneni ramesh: చెన్నమనేని పౌరసత్వ వివాదం.. మరోసారి హైకోర్టులో విచారణ

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ పౌరసత్వ వివాదంపై మరోసారి హైకోర్టులో విచారణ జరిగింది. చెన్నమనేని ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ గతంలో

Updated : 10 Aug 2021 15:27 IST

హైదరాబాద్‌: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ పౌరసత్వ వివాదంపై మరోసారి హైకోర్టులో విచారణ జరిగింది. చెన్నమనేని ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ గతంలో ఆది శ్రీనివాస్‌ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గతకొంతకాలంగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో ఏడాది క్రితం కేంద్ర హోంశాఖ చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ మరోసారి విచారణ జరగ్గా.. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) రాజేశ్వరరావు, చెన్నమనేని తరఫున న్యాయవాది రామారావు, పిటిషనర్‌ ఆది శ్రీనివాస్ తరఫున రవికిరణ్ వాదనలు వినిపించారు.

చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడేనని ఏఎస్‌జీ రాజేశ్వరరావు మరోసారి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఓసీఐ దరఖాస్తులోనూ జర్మనీ పౌరుడుగా ప్రస్తావించారని.. జర్మనీ పాస్‌పోర్టును 2023 వరకు పునరుద్ధరించుకున్నారని న్యాయవాది రవికరణ్ వాదనలు వినిపించారు. చెన్నమనేని జర్మనీ పౌరసత్వాన్ని వదలుకున్నారని రమేష్‌ తరఫు న్యాయవాది రామారావు కోర్టుకు వివరించారు. పౌరసత్వాన్ని వదులుకున్నట్లయితే ఓసీఐ దరఖాస్తులో జర్మనీ పౌరుడిగా ఎలా పేర్కొన్నారని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరాలు తెలుసుకొని న్యాయస్థానానికి వివరిస్తామని రామారావు పేర్కొన్నారు. పిటిషన్‌పై విచారణను ఈనెల 24కి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని