AP News: ఏపీ హైకోర్టు అదనపు భవనానికి సీజే శంకుస్థాపన

ఏపీ హైకోర్టు అదనపు భవనానికి లాంఛనంగా శంకుస్థాపన చేశారు. ఉదయం 9.50నిమిషాలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర

Updated : 13 Dec 2021 15:23 IST

అమరావతి: ఏపీ హైకోర్టు అదనపు భవనానికి లాంఛనంగా శంకుస్థాపన చేశారు. ఉదయం 9.50నిమిషాలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర చేతుల మీదుగా శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, సీఆర్‌డీఏ అధికారులు, ప్రభుత్వ న్యాయవాదులు, బార్‌ అసోయేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రస్తుతం ఉన్న భవనం పూర్తి స్థాయి కోర్టు విధుల నిర్వహణకు సరిపోకపోవడంతో హైకోర్టు ఎదురుగా అదనపు భవనం నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. అదనపు భవనాన్ని G+5సామర్థ్యంతో నిర్మించనున్నారు. నిర్మాణ ప్రణాళిక, ఇతర అంశాలను ఉన్నతాధికారులు.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా ఇతరులకు వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని