TS News: హైదరాబాద్‌లో ఐఏఎంసీని ప్రారంభించిన సీజేఐ, సీఎం కేసీఆర్‌

దేశంలోనే మొదటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ కేంద్రం (ఐఏఎంసీ) హైదరాబాద్‌లో ప్రారంభం అయింది.

Updated : 18 Dec 2021 13:13 IST

హైదరాబాద్‌: దేశంలోనే మొదటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ కేంద్రం (ఐఏఎంసీ) హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. నానక్‌రాంగూడ ఫొనిక్స్‌ వీకే టవర్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాంగణాన్ని సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణకు కేసీఆర్‌ అప్పగించారు. అనంతరం ఇద్దరూ కలిసి ఐఏఎంసీలోని వసతులు, ఏర్పాట్లను పరిశీలించారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో ఏర్పాటవుతున్న ఈ కేంద్రానికి శాశ్వత భవనం కోసం భూకేటాయింపులు కూడా పూర్తయ్యాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని