Updated : 22/11/2021 11:28 IST

CJI: సత్యసాయి మార్గాన్ని అందరూ పాటించాలి: సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

పుట్టపర్తి: విలువలతో కూడిన విద్య అందించే దిశగా వర్సిటీలు ముందుకెళ్లాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. విలువలతో కూడిన నైపుణ్యాలతో ప్రపంచాన్నే మార్చే శక్తి వస్తుందని చెప్పారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి వర్సిటీ 40వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహా సమాధిని జస్టిస్‌ ఎన్‌.వి. రమణ దంపతులు  దర్శించుకున్నారు. అనంతరం స్నాతకోత్సవంలో సీజేఐ చేతుల మీదుగా విద్యార్థులకు బంగారు పతకాలు, పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ మాట్లాడారు.

ఈనాటి నా పదవులు, గౌరవానికి ఆయన ఆశీస్సులే కారణం..

‘‘పతకాలు అందుకున్న విద్యార్థులకు అభినందనలు. విద్యార్థి దశలో కీలక దశ ముగించుకుని తర్వాతి దశకు వెళ్తున్నారు. ఇక్కడ నేర్చుకున్న విలువలను ప్రపంచానికి చాటి చెప్పాలి. ఆకాశమే హద్దుగా అవకాశాలను అందిపుచ్చుకోండి. నిస్వార్థ సేవా కార్యక్రమాలు నేటి సమాజానికి తక్షణ అవసరం. మిగిలిన వర్సిటీలతో పోలిస్తే సత్యసాయి వర్సిటీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. విద్యార్థులపై సత్యసాయిబాబా వాత్సల్యానికి ఈ వర్సిటీ ప్రతీక. ఆధునిక గురుకులాలకు ఇది ఆదర్శ నమూనా. సత్యసాయి ప్రవచించిన ప్రేమను సమాజానికి, పర్యావరణానికి, భూమాతకు మనం అందించాలి. ఈనాటి నా పదవులు, గౌరవానికి సత్యసాయి ఆశీస్సులే కారణం. సత్యసాయి మాతృప్రేమకు ఎంతో విలువ ఇచ్చేవారు. ఎక్కడికెళ్లినా మాతృభాషకు ప్రాధాన్యమిచ్చేవారు. సత్యసాయి మార్గాన్ని అందరూ పాటించాల్సిన అవసరముంది.

అవలక్షణాలను సరిచేసుకోవాలి..

రామాయణం, మహాభారతంలో నేటికీ వర్తించే ఎన్నో విషయాలు ఉన్నాయి. పెద్దలను గౌరవిస్తున్నారా అనేది పాలకులు గుర్తుంచుకోవాలి. ప్రజలను బాగా చూసుకుంటున్నారా? లేదా? బలహీనుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నారా? అనేది ఆలోచించాలి. ఒక్కసారి అధికారంలోకి వస్తే 14 అవలక్షణాలు వస్తాయి. అవలక్షణాలను సరిచేసుకుని మంచిపాలన అందించాలి’’ అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు.


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని