AP News: కనకదుర్గమ్మను దర్శించుకున్న సీజేఐ దంపతులు

ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు.

Updated : 25 Dec 2021 12:53 IST

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు. సీజేఐ దంపతులకు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జస్టిస్‌ ఎన్వీ రమణ సంప్రదాయ వస్ర్తధారణలో ఇంద్రకీలాద్రికి వచ్చారు. తలకు పరివేష్ఠం కట్టుకుని ఆయన దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం సీజేఐ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి పేర్ని నాని, ఎంపీ కేశినేని నాని, దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్‌, కమిషనర్‌ హరి జవహర్‌లాల్, కలెక్టర్‌ నివాస్‌, పాలకమండలి ఛైర్మన్‌ సోమినాయుడు, ఈవో భ్రమరాంబ.. సీజేఐకి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

అనంతరం నొవాటెల్‌ హోటల్‌కు చేరుకున్న సీజేఐని పలువురు ప్రజాప్రతినిధులు, జడ్జిలు, న్యాయవాదులు కలిశారు. జస్టిస్‌ ఎన్వీ రమణతో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ సమావేశమయ్యారు. జస్టిస్‌ ఎన్వీరమణను చినజీయర్‌స్వామి ఆశ్రమ పండితులు కలిశారు. ఈ సందర్భంగా వేదపండితులు జస్టిస్‌ ఎన్వీరమణకు ఆశీర్వచనాలు అందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని