CJI: స్కూల్‌లో లైబ్రరీ, గ్రౌండ్‌ నిబంధన ఎవరూ పాటించట్లేదు: సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

వ్యాయామం, పుస్తక పఠనం ఎంతో మార్పు తెస్తాయని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించిన 34వ హైదరాబాద్‌ పుస్తక

Updated : 29 Dec 2021 13:42 IST

హైదరాబాద్‌: వ్యాయామం, పుస్తక పఠనం ఎంతో మార్పు తెస్తాయని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించిన 34వ హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శన ముగింపు కార్యక్రమానికి సీజేఐ హాజరయ్యారు. ఇంటినే గ్రంథాలయంగా మార్చిన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకికి చెందిన కూరెళ్ల విటలాచార్యను సీజేఐ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం సెల్‌ఫోన్‌ హస్తభూషణంగా మారిందని, యువతరం పుస్తక ప్రదర్శనకు రావడంతో ఆశలు చిగురించాయని తెలిపారు.  పుస్తకం సజీవంగా ఉంటుందనే నమ్మకం కలిగిందని చెప్పారు. రోజూ 2..3గంటలు గ్రంథాలయంలో పుస్తకాలు చదివానన్న జస్టిస్‌ ఎన్వీ రమణ... జీవితంలో పైకి రావటానికి అప్పటి జ్ఞానం ఎంతో ఉపపయోగపడిందని వివరించారు. ప్రస్తుతం పాఠశాలలు,  కళాశాలల్లో లైబ్రరీ, ఆటస్థలం నిబంధన ఎవరూ పాటించట్లేదని, ప్రభుత్వాలే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. పలు బుక్‌ స్టాళ్లను జస్టిస్‌ ఎన్వీ రమణ సందర్శించి .. కొన్ని పుస్తకాలు కొనుగోలు చేశారు. నడుచుకుంటూ వెళ్తుండగా పిల్లలు కనిపించడంతో వారితో కాసేపు మాట్లాడి.. ఫొటోలు దిగారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని