CJI: వరంగల్‌ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు.

Updated : 19 Dec 2021 13:07 IST

వరంగల్‌: వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు. వారితో పాటు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ దంపతులు కూడా ఉన్నారు. తొలుత ఆలయం వద్దకు చేరుకున్న వారికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత వేయిస్తంభాల గుడిని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ సందర్శించి రుద్రేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. 

ఫొటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని