AP News: జగనన్న స్వచ్ఛ సంకల్పం, క్లీన్‌ ఏపీ ప్రారంభం

ఏపీలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రత, స్వచ్ఛభారత్ లక్ష్యంలో భాగంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం,

Updated : 08 Dec 2022 16:10 IST

విజయవాడ: ఏపీలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రత, స్వచ్ఛభారత్ లక్ష్యంలో భాగంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం, క్లీన్ ఆంధ్రప్రదేశ్(క్లాప్‌) కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విజయవాడలోని బెంజి సర్కిల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని 4,097 చెత్త సేకరణ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. అంతకముందు గార్బేజ్ టిప్పర్‌, హై ప్రెజర్‌ క్లీనర్లను ఆయన పరిశీలించారు. క్లాప్‌ కార్యక్రమ ప్రచార సీడీని ఆవిష్కరించారు. బెంజిసర్కిల్‌ నుంచి ఈ వాహనాలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లనున్నాయి. 

మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణతో కూడిన ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందించడమే లక్ష్యంగా క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం 100 రోజుల పాటు పలు కార్యక్రమాలను నిర్వహించనుంది. తడి, పొడి చెత్తలతో పాటు ప్రమాదకరమైన వ్యర్థాల సేకరణ కోసం ఇంటింటికీ 3 డస్ట్‌బిన్‌ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 1.2 కోట్ల డస్ట్‌బిన్‌ల పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇవాళ ప్రారంభించిన వాహనాల ద్వారా తడి, పొడి చెత్తలను వేరు చేసి సేకరిస్తారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని