CM Jagan: శ్రీవారి సేవలో జగన్‌.. శ్రీవేంకటేశ్వర హిందీ, కన్నడ భక్తి ఛానల్స్‌ ప్రారంభం

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని సీఎం జగన్‌ దర్శించుకున్నారు. తిరుమలేశుని సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో

Updated : 12 Oct 2021 12:47 IST

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని సీఎం జగన్‌ దర్శించుకున్నారు. తిరుమలేశుని సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన జగన్‌ ఇవాళ మరోసారి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఉదయం ఆరు గంటలకు ఆలయానికి చేరుకొని శ్రీనివాసుడిని దర్శించుకొని తులాభారం వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. తన బరువుకు సమానంగా 78 కిలోల బియ్యం శ్రీవారికి సమర్పించారు.

అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి కలిసి స్వామివారి తీర్థప్రసాదాలను సీఎంకు అందజేశారు. మరోవైపు  తిరుమలలో నిర్మించిన నూతన బూందీపోటుతో పాటు శ్రీవేంకటేశ్వర భక్తి హిందీ, కన్నడ ఛానల్స్‌ను జగన్‌ ప్రారంభించారు. అన్నమయ్య భవన్‌లో తితిదే చేపట్టిన నూతన కార్యక్రమాలను అధికారులు సీఎంకు వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని