CM Jagan: ఉత్తరాంధ్రకు తుపాను హెచ్చరికలు.. సీఎం జగన్‌ సమీక్ష

ఉత్తరాంధ్రకు తుపాను హెచ్చరికల దృష్ట్యా ఆయా జిల్లా కలెక్టర్లతో ఏపీ సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.

Published : 02 Dec 2021 11:46 IST

అమరావతి: ఉత్తరాంధ్రకు తుపాను హెచ్చరికల దృష్ట్యా ఆయా జిల్లా కలెక్టర్లతో ఏపీ సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తచర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. అవసరమైన అన్ని చోట్లా సహాయ శిబిరాలు తెరిచేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని.. లోతట్టు, ముంపు ప్రాంతాలుంటే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపానుతో ఉత్పన్నమయ్యే పరిస్థితుల వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూడాలని జగన్‌ ఆదేశించారు. 

తుపాను సహాయ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతను ముగ్గురు సీనియర్‌ అధికారులకు సీఎం అప్పగించారు. శ్రీకాకుళం జిల్లాకు హెచ్‌.అరుణ్‌కుమార్‌, విజయనగరం జిల్లాకు కాంతాలాల్‌ దండే, విశాఖ జిల్లాకు శ్యామలరావును నియమించారు. వారు వెంటనే ఆయా జిల్లాలకు చేరుకుని తుపాను సహాయ కార్యక్రమాల సమన్వయ, పర్యవేక్షక బాధ్యతలు స్వీకరించాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని