Updated : 11 Nov 2021 14:06 IST

CM Jagan: బాధితులకు రూ.వెయ్యి చొప్పున అందించండి: సీఎం జగన్‌

అమరావతి: భారీ వర్షాల నేపథ్యంలో నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం జగన్‌ ఆదేశించారు. బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాలు చర్యలు తీసుకోవాలన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నెల్లూరు జిల్లాలోని తడ, సూళ్లూరుపేట సహా మరికొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారుల చెబుతున్నారని..  ముఖ్యంగా తమిళనాడు సరిహద్దుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. 

బాధితుల కోసం ఏం కావాలన్నా వెంటనే అడగాలని.. శిబిరాల్లో వారికి మంచి ఆహారం అందించాలన్నారు. బాధితులకు రూ.వెయ్యి చొప్పున పరిహారం అందించాలని సీఎం సూచించారు. అన్ని విభాగాలు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ముంపు ప్రాంతాల నుంచి ప్రజల్ని తరలించేందుకు చర్యలు చేపట్టాలని.. అవసరమైన చోట సహాయ శిబిరాలు తెరవాలని జగన్‌ ఆదేశించారు.  అవసరమైన మందులనూ అందుబాటులో ఉంచుకోవాలని, పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. పారిశుద్ధ్యం విషయంలోనూ చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా జనరేటర్లను సిద్ధం చేసుకోవాలన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతింటే వెంటనే వాటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని, యుద్ధప్రాతిపదికన పనులు జరిగేలా విద్యుత్‌ శాఖ అధికారులు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని