CM Jagan: పక్షపాతాలకు తావుండకూడదు.. పూర్తి పారదర్శకంగా నియామకాలుండాలి: సీఎం జగన్‌

నియామకాల్లో పక్షపాతాలకు తావుండకూడదని.. పూర్తి పారదర్శకంగా నియామక ప్రక్రియ చేపట్టాలని ఏపీ సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్యపై అధికారులతో

Updated : 25 Oct 2021 15:47 IST

అమరావతి: నియామకాల్లో పక్షపాతాలకు తావుండకూడదని.. పూర్తి పారదర్శకంగా నియామక ప్రక్రియ చేపట్టాలని ఏపీ సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్యపై అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. వర్సిటీల్లో బోధనా సిబ్బంది నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. బోధన సిబ్బందిలో నాణ్యతతో పాటు ఉన్నత ప్రమాణాలు ఉండేలా నియామకం ఉండాలన్నారు. ఈ మేరకు ప్రతివారం ఒక్కో వీసీతో మాట్లాడాలని ఉన్నత విద్యామండలిని సీఎం ఆదేశించారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, వర్సిటీలు సమన్వయం కావాలని సీఎం సూచించారు. వర్సిటీల్లో సమస్యలు, ప్రభుత్వ తోడ్పాటుపై వీసీలతో చర్చించాలని.. సమావేశాల్లో గుర్తించిన అంశాలను తన దృష్టికి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. నైపుణ్యాభివృద్ధి కోర్సులను ఆన్‌లైన్‌లోనూ ఉంచాలన్నారు.

ఆంగ్లం అన్నది తప్పనిసరి పాఠ్యాంశం కావాలని.. ఆంగ్లం వల్ల ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని సీఎం పేర్కొన్నారు. తెలుగు నుంచి ఆంగ్ల మాధ్యమానికి మారేవారికి సులభంగా ఉండాలన్నారు. ఆంగ్లం, తెలుగు భాషల్లో పాఠ్యపుస్తకాలు ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక డిగ్రీ కళాశాల ఉండాలన్నారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థల అప్పగింతలో ఎలాంటి బలవంతం లేదన్నారు. చాలా విద్యా సంస్థల్లో సమస్యలు ఉన్నాయని సీఎం చెప్పారు. ఎయిడెడ్‌ విద్యా సంస్థలను అప్పగిస్తే ప్రభుత్వమే చూస్తుందని.. తామే నడుపుకుంటామని భావించినా ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని