Ap News: విద్యార్థులకు అదనపు వసతులు కల్పించాలి: సీఎం జగన్‌

‘నాడు-నేడు’ వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన పిల్లలకు అదనపు వసతులు కల్పించాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల నిర్వహణపై

Published : 05 Jan 2022 20:04 IST

అమరావతి: ‘నాడు-నేడు’ వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన పిల్లలకు అదనపు వసతులు కల్పించాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల నిర్వహణపై సంబంధిత అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. బడుల్లో అదనపు వసతులు, బోధనా సిబ్బందిపై దృష్టి సారించాలన్నారు. నాడు-నేడులో భాగంగా పాఠశాలల్లో తీసుకున్న చర్యల నివేదికలను ఎప్పటికప్పుడు అందించాలని అధికారులను ఆదేశించారు. కొత్త విద్యావిధానం ప్రకారం ఇప్పటివకే కొన్ని పాఠశాలలు ఏర్పాటు కాగా.. కొత్తగా మరో 6 బడులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పాఠశాలల మ్యాపింగ్‌ మేరకు సిబ్బందిని నియమించాలని.. వీలైనంత త్వరగా మిగతా స్కూ్ళ్ల మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. అన్ని పాఠశాలల్లో సబ్జెక్టల వారీగా బోధనా సిబ్బంది ఉండాలన్నారు. ఆంగ్ల పరిజ్ఞానం కోసం యాప్స్‌ను బాగా వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా అధికారులు నిరంతరం పాఠశాలలను పర్యవేక్షించాలని.. ‘గోరుముద్ద’లో ఇచ్చే ఆహార నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని