CM Jagan: వరదల్లో ఇళ్లు కోల్పోయిన వారికి 5సెంట్ల స్థలంలో ఇల్లు: జగన్‌

భారీ వర్షాలు, వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి అయిదు సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించి ఇస్తామని ఏపీ సీఎం జగన్‌ ప్రకటించారు. కడప జిల్లా రాజంపేట మండలం పులపుత్తూరులో

Published : 02 Dec 2021 17:04 IST

కడప: భారీ వర్షాలు, వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి అయిదు సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించి ఇస్తామని ఏపీ సీఎం జగన్‌ ప్రకటించారు. కడప జిల్లా రాజంపేట మండలం పులపుత్తూరులో వరద బాధితులను సీఎం పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పులపుత్తూరులో 293 ఇళ్లు దెబ్బతిన్నాయని, వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పంటలు నష్టపోయిన రైతులందరికీ పరిహారం ఇస్తామని ప్రకటించారు. పొలాల్లో ఇసుక మేటలు తొలగించడానికి హెక్టారుకు రూ.12వేలు ఇస్తామని తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా అందరికీ ఉపాధి కల్పిస్తామన్నారు. వరదల కారణంగా డ్వాక్రా డబ్బులు చెల్లించలేమని మహిళలు ఆవేదన వ్యక్తం చేయగా.. ఏడాది పాటు మారటోరియం విధిస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు. వాహనాలు కోల్పోయిన వారికి కూడా సాయం చేస్తామని సీఎం ప్రకటించారు. యువత కోసం జాబ్‌ మేళా ఏర్పాటు చేసి ప్రైవేటు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. పది రోజుల్లో అన్ని సహాయ కార్యక్రమాలు  చేస్తామని పేర్కొన్నారు. ఎగువ మందపల్లిలో వరద బాధితులను సీఎం పరామర్శించారు. తొమ్మిది మంది కుటుంబ సభ్యులను కోల్పోయిన పూజారి రామమూర్తిని సీఎం ఓదార్చి భరోసా ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని