
Updated : 29 Dec 2021 15:06 IST
TS News: ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ను పరామర్శించిన కేసీఆర్
నల్గొండ: నల్గొండ జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ను సీఎం కేసీఆర్ నల్గొండలో పరామర్శించారు. ఇటీవల కిశోర్ తండ్రి మారయ్య గుండెపోటుతో మృతిచెందారు. ఈ సందర్భంగా నల్గొండలో నిర్వహించిన ఆయన దశదినకర్మలో పాల్గొన్న కేసీఆర్.. మారయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం కిశోర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎం వెంట మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితో సహా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు ఉన్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత సీఎం హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.
Tags :