CM Kcr: సచివాలయ పనుల పురోగతిపై సీఎం కేసీఆర్‌ సంతృప్తి

సచివాలయ భవన నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశీలించారు. మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, అధికారులతో కలిసి సచివాలయ ప్రాంగణానికి వచ్చిన సీఎం..

Updated : 09 Dec 2021 21:05 IST

హైదరాబాద్‌: సచివాలయ భవన నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశీలించారు. మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, అధికారులతో కలిసి సచివాలయ ప్రాంగణానికి వచ్చిన సీఎం.. గంటన్నర పాటు పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న భవనంలోకి వెళ్లిన ముఖ్యమంత్రి.. రెండంతస్తుల వరకు వెళ్లి పరిశీలించారు. పనుల పురోగతిపై ఆరా తీశారు. పనులు జరుగుతున్న తీరు, పూర్తయ్యే సమయాలను అధికారులు, ఇంజినీర్లు సీఎంకు వివరించారు. 

భవనం పశ్చిమ భాగాన ఇప్పటికే ఐదంతస్తుల వరకు శ్లాబు పనులు పూర్తికాగా, ఆరో అంతస్తు శ్లాబు పనులు కొనసాగుతున్నాయి. ముందు భాగంలో మూడో శ్లాబు  పనులు జరుగుతున్నాయి. రెండంతస్తుల్లో మంత్రుల చాంబర్లలోని గదులు, సీలింగ్‌ తదితర నిర్మాణాలపై సీఎం ఆరా తీశారు. పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్‌.. అధికారులు, ఇంజినీర్లు, సిబ్బందిని అభినందించారు. భవన నిర్మాణంలో వినియోగించే రాళ్లు, టైల్స్‌, గ్రానైట్స్‌, మార్బుల్స్‌ సహా ఇతర సామగ్రిని పరిశీలించారు. వివిధ ప్రాంతాల్లో ఉపయోగించాల్సిన వాటిని సీఎం ఎంపిక చేసినట్టు తెలిసింది. ఎర్రకోట నిర్మాణానికి వినియోగించిన ఆగ్రా ఎర్ర రాతిని సచివాలయ భవనం వెలుపలి గోడలకు వినియోగించనున్నారు. మధ్యలో ధోల్‌పూర్‌ బీజ్‌ రాతిని ఉపయోగిస్తారు. పైభాగం కోసం మరో రంగు రాతిని తీసుకురావాలని సీఎం ఆదేశించినట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని