TS News: మల్లన్నసాగర్‌ వద్ద సీఎం కేసీఆర్‌ విహంగవీక్షణం

మల్లన్నసాగర్ జలాశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ విహంగవీక్షణం ద్వారా పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అత్యంత ఎక్కువగా 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించి...

Published : 12 Oct 2021 01:14 IST

హైదరాబాద్: మల్లన్నసాగర్ జలాశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ విహంగవీక్షణం ద్వారా పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అత్యంత ఎక్కువగా 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మల్లన్నసాగర్‌లో ఈ సీజన్ నుంచే నీటిని నింపుతున్నారు. ఈ ఏడాది పది టీఎంసీలు నింపాలని... దశలవారీగా పూర్తిగా నీరు నింపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం మల్లన్నసాగర్ జలాశయంలో 10.6 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ సామర్థ్యంతో జలాశయం, కట్టను పూర్తి స్థాయిలో పరిశీలించాక మళ్లీ నీటిని నింపుతారు. విహంగవీక్షణం ద్వారా మల్లన్నసాగర్‌ను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అన్నింటినీ క్షుణ్నంగా గమనించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని