TS News: నల్గొండ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ వరాలు

నల్గొండ కలెక్టరేట్‌లో సీఎం కేసీఆర్‌ సమావేశం ముగిసింది. మంత్రులు జగదీశ్‌రెడ్డి, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎ మ్మెల్సీలు, అధికారులు సమావేశానికి

Updated : 29 Dec 2021 20:02 IST

నల్గొండ: నల్గొండ కలెక్టరేట్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్‌ సమీక్షా సమావేశం ముగిసింది. మంత్రులు జగదీశ్‌రెడ్డి, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎ మ్మెల్సీలు, అధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా నల్గొండలో మౌలిక వసతులు, పలు అభివృద్ధి పనులపై చర్చ జరిగింది. నల్గొండ పట్టణాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఈనెల 31న జిల్లాలో ఐటీ హబ్‌కు శంకుస్థాపన చేయనున్నట్టు సీఎం తెలిపారు. జిల్లాలో రెండు సూపర్‌ మార్కెట్ల ఏర్పాటుకు సీఎం ఆదేశించారు. పాన్‌గల్‌లో ట్యాంక్‌బండ్‌, శిల్పకళా తోరణం ఏర్పాటు చేయాలని సూచించారు. డిగ్రీ కళాశాల భవనం నిర్మాణానికి రూ.36 కోట్లు మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. నల్గొండలో రహదారుల విస్తరణ, టౌన్‌హాల్‌ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని