TSRTC: కరోనా, డీజిల్‌ ధరలు ఆర్టీసీని దెబ్బతీశాయి: కేసీఆర్‌

టీఎస్‌ఆర్టీసీని గట్టెంకించే ప్రయత్నం ప్రారంభమైందని.. రెండేళ్ల క్రితమే పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. గాడిలో పడుతున్న దశలో కరోనా, డీజిల్‌ ధరలు ...

Updated : 21 Sep 2021 22:36 IST

హైదరాబాద్‌: టీఎస్‌ఆర్టీసీని గట్టెంకించే ప్రయత్నం ప్రారంభమైందని.. రెండేళ్ల క్రితమే పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. గాడిలో పడుతున్న దశలో కరోనా, డీజిల్‌ ధరలు ఆర్టీసీని దెబ్బతీశాయని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఆర్టీసీ తిరిగి ఆర్థిక నష్టాల్లో కూరుకుపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఆర్టీసీని తిరిగి నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. టీఎస్ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, కరోనా ప్రభావంపై సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. ఆర్టీసీపై పెరిగిన డీజిల్‌ రేట్ల భారంపై సమవేశంలో చర్చించారు. ఆర్టీసీ తిరిగి పుంచుకునేందుకు కార్యాచరణపై సీఎం సమీక్షించారు. మంత్రులు పువ్వాడ అజయ్, కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్‌, ఎండీ, ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు.

ఆర్టీసీపై ఏటా రూ.500 కోట్ల భారం పడుతోందని అధికారులు సీఎంకు వివరించారు. లాక్‌డౌన్‌తో ఆర్టీసీ రూ.3 వేల కోట్ల ఆదాయం కోల్పోయిందన్నారు. మొత్తంగా 97 డిపోలు నష్టాల్లోనే ఉన్నాయన్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితి నెలకొందన్నారు. 2020 మార్చిలో ఛార్జీలు పెంచుతామని ప్రభుత్వం చెప్పినట్లు గుర్తు చేశారు. ఇప్పటివరకు ఛార్జీలు పెంచలేదని..ఛార్జీలు పెంచేందుకు అనుమతిస్తే తప్ప ఆర్టీసీకి మనుగడ లేదని అధికారులు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని