CM Kcr: యాదాద్రి నారసింహుని పాదాల చెంత.. ఆలయ పునఃప్రారంభ ముహూర్త పత్రిక 

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని సీఎం కేసీఆర్‌ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పునఃప్రారంభ ముహూర్త పత్రికను సీఎం కేసీఆర్‌ ఈవోకు అందజేశారు.

Updated : 19 Oct 2021 17:54 IST

యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని సీఎం కేసీఆర్‌ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పునఃప్రారంభ ముహూర్త పత్రికను సీఎం కేసీఆర్‌ ఈవోకు అందజేశారు. ముహూర్త పత్రికను స్వామి పాదాల చెంత ఉంచాలని సీఎం సూచించారు. చినజీయర్‌ స్వామి స్వదస్తూరితో ముహూర్త పత్రిక రాసిచ్చిన విషయం తెలిసిందే.

ఆలయం పునఃప్రారంభం సందర్భంగా 10వేల మంది రుత్వికులతో సుదర్శన హోమం నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు. సుదర్శన హోమాన్ని చినజీయర్‌స్వామి పర్యవేక్షిస్తారని తెలిపారు. అర్చకులు, ఆలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. రింగ్‌రోడ్డులో స్థలాలు కోల్పోయిన వారిని ఆదుకుంటామని తెలిపారు. బాధితులకు ఉచితంగా దుకాణాలు నిర్మించి ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని