50వేల ఉద్యోగాలకు కార్యాచరణ ప్రారంభం: కేసీఆర్‌

స్వరాష్ట్ర ఫలాలను వర్తమాన, భవిష్యత్ తరాలకు పూర్తి స్థాయిలో అందించేలా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను తీర్చిదిద్దుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ప్రపంచ యువజన

Updated : 15 Jul 2021 17:04 IST

హైదరాబాద్‌: స్వరాష్ట్ర ఫలాలను వర్తమాన, భవిష్యత్ తరాలకు పూర్తి స్థాయిలో అందించేలా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను తీర్చిదిద్దుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా యువతకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి కార్యాచరణ చేపట్టినట్లు చెప్పారు. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనే ధ్యేయంగా ఏడేళ్లుగా అమలు చేస్తున్న కార్యాచరణ కొలిక్కి వచ్చిందన్నారు. స్వరాష్ట్ర ఫలాలను యువత ఆస్వాదించే సానుకూల వాతావరణం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా నెలకొందని సీఎం అన్నారు. పలు పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశామని.. తద్వారా గ్రామీణ యువతకు ఉపాధి కల్పన పెరుగుతుందని పేర్కొన్నారు.

‘‘పరిశ్రమలు, ఐటీ రంగంలో లక్షలాది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పించింది. ప్రభుత్వ రంగంలో ఇప్పటికే 1.30 లక్షలకు పైగా ఉద్యోగాలు అందించాం. మరో 50 వేల ఉద్యోగాల కోసం కార్యాచరణ ప్రారంభించాం. భవిష్యత్‌లో జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నాం. వ్యవసాయ రంగం నేటి యువతను కూడా ఆకర్షిస్తుండటం వెనక తెలంగాణ ప్రభుత్వ శ్రమ ఎంతో ఉంది. పారిశ్రామిక, వాణిజ్యం, ఐటీ రంగాలు సహా వ్యవసాయం, అనుబంధ రంగాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతూ లక్షలాది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. మారిన పరిస్థితుల్లో యువత మరింత సమర్థంగా నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ యువతకు సరైన నైపుణ్యాలు తోడైతే తిరుగులేని యువశక్తిగా అవతరిస్తుంది. యువతలో నైపుణ్యాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. ఐటీ, సాంకేతిక రంగాల్లో ఉద్యోగాలు లభించేలా దేశంలోనే తొలిసారిగా టాస్క్ ఏర్పాటు చేశాం’’ అని సీఎం తెలిపారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని