TS News: ప్రభుత్వాసుపత్రిలో కలెక్టర్‌ సతీమణికి కాన్పు

భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ అనుదీప్‌ భార్య మాధవి భద్రాచలం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రసవం కోసం కలెక్టర్‌ సతీమణి మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఆసుపత్రిలో

Updated : 10 Nov 2021 14:17 IST

భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ అనుదీప్‌ భార్య మాధవి భద్రాచలం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రసవం కోసం కలెక్టర్‌ సతీమణి మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఆసుపత్రిలో చేరారు. డీసీహెచ్‌ఎస్‌ డా.ఎం.ముక్కంటేశ్వరరావు, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డా.రామకృష్ణ ఆధ్వర్యంలో వైద్యులు ఆమెకు అవసరమైన పరీక్షలు నిర్వహించారు. రాత్రి ఒంటి గంట సమయంలో కలెక్టర్‌ సతీమణికి సిజేరియన్‌ చేశారు. పండంటి మగ బిడ్డ జన్మించడంపై కలెక్టర్‌ అనుదీప్ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. కొంతకాలంగా ఈమె ఇక్కడి ఆసుపత్రికి వచ్చి గైనకాలజిస్టుల సలహాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై మరింత నమ్మకం కలిగించేందుకు కలెక్టర్‌ చేసిన ప్రయత్నం పట్ల పలువురు అభినందనలు తెలుపుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని