Ts news: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసు.. విచారణకు హాజరైన హోంశాఖ కార్యదర్శి

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఏర్పాటైన త్రిసభ్య కమిషన్‌ విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శనివారం చేపట్టిన విచారణలో ప్రభుత్వం తరఫున హోంశాఖ కార్యదర్శి..

Published : 22 Aug 2021 01:00 IST

హైదరాబాద్‌: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఏర్పాటైన త్రిసభ్య కమిషన్‌ విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శనివారం చేపట్టిన విచారణలో ప్రభుత్వం తరఫున హోంశాఖ కార్యదర్శి రవి గుప్త హాజరయ్యారు. త్రిసభ్య కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ వికాస్‌ సిర్పూర్కర్‌, జస్టిస్‌ రేఖ, జస్టిస్‌ కార్తికేయన్‌ విచారించారు. ఎన్‌కౌంటర్ చోటు చేసుకున్న తేదీ నుంచి అఫిడవిట్లు సమర్పించడం వరకు అన్ని వివరాలను రవిగుప్త కమిషన్‌కు వివరించారు. మస్తాన్‌ వలితో పాటు పలువురు న్యాయవాదులు ఎన్‌కౌంటర్‌పై తమకున్న సందేహాలను కమిషన్‌ ముందుంచారు. దీనికి హోంశాఖ కార్యదర్శి రవిగుప్త సమాధానమిచ్చారు. సాక్షులను ఆగస్టు 26, 27, 28 తేదీల్లో కమిషన్‌ విచారించనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని