telugu academy: డిపాజిట్ల గోల్‌మాల్‌ ఎలా జరిగింది?: సిబ్బందిని ప్రశ్నించిన త్రిసభ్య కమిటీ

తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గోల్‌మాల్‌పై ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ ప్రారంభించింది...

Updated : 30 Sep 2021 18:30 IST


హైదరాబాద్‌: తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గోల్‌మాల్‌పై ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ ప్రారంభించింది. హైదరాబాద్‌ హిమాయత్‌ నగర్‌లోని తెలుగు అకాడమీకి చేరుకున్న అధికారులు తనిఖీలు చేపట్టారు. అకాడమీలో పనిచేస్తున్న ఉద్యోగులను ఒక్కొక్కరినీ పిలిచి నిధుల గోల్‌మాల్‌పై ఆరా తీస్తున్నారు. కమిటీ హెడ్‌, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌ ఆధ్వర్యంలో ప్రతి రికార్డును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇంటర్‌బోర్డు కార్యదర్శితో పాటు బోర్డులోని అకౌంట్స్‌ అధికారి, కళాశాల విద్యాశాఖ సంయుక్త సంచాలకుడు విచారణ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ వ్యవహారంపై అక్టోబరు 2వ తేదీలోపు నివేదిక అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోపక్క హైదరాబాద్‌ పోలీసులు లెక్కలు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని