Ts corona: తెలంగాణలో 2వేలు దాటిన కేసులు.. జీహెచ్‌ఎంసీలోనే 1,452 నమోదు

తెలంగాణ ప్రజలపై కొవిడ్‌ మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. గత మూడు రోజులుగా కొవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో కొవిడ్ కేసులు 2వేల

Updated : 07 Jan 2022 19:54 IST

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలపై కొవిడ్‌ మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. గత మూడు రోజులుగా కొవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో కొవిడ్ కేసులు 2వేల మార్క్‌ దాటాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 64,474 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 2,295 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,89,751కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 4,039కి చేరింది. కరోనా నుంచి నిన్న 278 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9,861 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజు వ్యవధిలో నమోదైన మొత్తం కేసుల్లో 1,452 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని