
Published : 04 Dec 2021 17:46 IST
corona update: ఏపీలో కొత్తగా 186 కరోనా కేసులు.. ముగ్గురి మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 32,036 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 186 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. కరోనాతో నిన్న కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. కరోనా బారి నుంచి నిన్న 191 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,149 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది.
Advertisement
Tags :