ap corona update: ఏపీలో కొత్తగా 1,246 కరోనా కేసులు..10మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 55,323 మంది నమూనాలు పరీక్షించగా 1,246 కొత్త కేసులు నమోదయ్యాయి.

Published : 24 Sep 2021 17:03 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 55,323 మంది నమూనాలు పరీక్షించగా 1,246 కొత్త కేసులు నమోదయ్యాయి. 10 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,450 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13,535 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్‌ వల్ల చిత్తూరులో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. 

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు...

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు