Published : 05/12/2021 21:10 IST

TS News: తెలంగాణలో కొత్తగా 156 కరోనా కేసులు.. ఒకరి మృతి

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 25,693 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 156 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ వల్ల నిన్న ఒకరు మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3,999కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 147 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,787 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. విదేశాల నుంచి ఇవాళ శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చిన 291 మంది ప్రయాణికులకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. నెగిటివ్‌ వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. జినోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపిన 13 మంది నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. 

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని