
Published : 21 Jan 2022 19:37 IST
TS News: తెలంగాణలో కొత్తగా 4,416 కరోనా కేసులు.. ఇద్దరి మృతి
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,20,243 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా .. కొత్తగా 4,416 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7,26,819కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,069కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1,920 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 29,127 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇవాళ 1670 కేసులు నమోదయ్యాయి.
ఇవీ చదవండి
Advertisement
Tags :