TS News: గురుకుల పాఠశాలలో 24 మంది బాలికలకు కరోనా.. ఆందోళనలో తల్లిదండ్రులు

జిల్లాలోని పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామంలోని బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో 24 మంది బాలికలు కరోనా బారిన పడినట్టు వైద్యులు తేల్చారు. వారం రోజుల క్రితం

Published : 02 Dec 2021 20:05 IST

సంగారెడ్డి: జిల్లాలోని పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామంలోని బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో 24 మంది బాలికలు కరోనా బారిన పడినట్టు వైద్యులు తేల్చారు. వారం రోజుల క్రితం ఆరో తరగతి విద్యార్థినికి జ్వరం రావడంతో తల్లిదండ్రులకు అప్పగించి ఇంటికి పంపించారు. ఆ విద్యార్థినికి కొవిడ్‌ నిర్ధారణ అయిందని బాలిక తండ్రి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌కు ఫోన్‌లో సమాచార మందించారు. దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది, వైద్యులు గురువారం ఉదయం నుంచి పాఠశాలలోని 300 మంది బాలికలకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 24 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్యులు తెలిపారు. దీంతో విద్యా్ర్థినుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. పాఠశాల మొత్తాన్ని శానిటైజ్‌ చేయిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని