
Published : 01 Dec 2021 17:51 IST
Ap corona update: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 184 కొవిడ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల వ్యవధిలో 29,595 పరీక్షలు నిర్వహించగా.. 184 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కొవిడ్ బారినపడి కృష్ణా జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,443కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 183 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,56,501 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 2,149 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇవీ చదవండి
Tags :