TS News: కరీంనగర్‌లో కరోనా కలకలం.. 46 మంది వైద్య విద్యార్థులకు కొవిడ్‌

కరీంనగర్‌లోని ప్రైవేటు వైద్య కళాశాలలో కరోనా కలకలం రేపింది. కళాశాలలోని 39 మంది విద్యార్థులకు కొవిడ్ నిర్ధారణ అయింది. ..

Updated : 05 Dec 2021 19:53 IST

కరీంనగర్‌ గ్రామీణం: కరీంనగర్‌ రూరల్‌ మండలం బొమ్మకల్‌లోని ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో కరోనా కలకలం రేపింది. ఇప్పటి వరకు కళాశాలలోని 46 మంది విద్యార్థులకు కొవిడ్ నిర్ధారణ అయింది. కొవిడ్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి. దీంతో యాజమాన్యం కళాశాలకు సెలవు ప్రకటించింది. కళాశాలలో వారం రోజుల క్రితం స్నాతకోత్సవం జరిగింది. ఈ సందర్భంగా కరోనా లక్షణాలు ఉన్న ఒకరిద్దరు విద్యార్థుల నుంచి మిగిలిన వారికి వ్యాపించి ఉంటుందని భావిస్తున్నారు. నిన్నటి పరీక్షల్లో 18 మందికి నిర్ధారణ కాగా, ఇవాళ నిర్వహించిన పరీక్షల్లో 28 మందికి పాజిటివ్‌గా తేలింది. కొందరు విద్యార్థులకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీంతో కరోనా లక్షణాలు లేని విద్యార్థులకు కూడా కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం కళాశాలకు సెలవు ప్రకటించినట్టు సమాచారం. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని