
TS News: కరోనా కలకలం.. టెక్ మహీంద్రా వర్సిటీకి 15 రోజులు సెలవులు
మేడ్చల్ : టెక్ మహీంద్ర వర్సిటీలో కరోనా కలకలం సృష్టించింది. వర్సిటీలో 25 మంది విద్యార్థులు, ఐదుగురి సిబ్బందికి కొవిడ్ సోకింది. దీంతో వైద్యాధికారులు చర్యలు చేపట్టారు. డీఎంహెచ్‌వో మల్లికార్జున్ వర్సిటీని పరిశీలించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 30 మంది కరోనా బాధితులు ఉన్నట్లు తెలిపారు. వర్సిటీ సిబ్బందికి, సమీపంలోని దుకాణదారులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరోనా నేపథ్యంలో వర్సిటీకి 15 రోజుల సెలవు ప్రకటించినట్లు వెల్లడించారు. అయితే పాజిటివ్ వచ్చిన వారంతా టీకా రెండు డోసులు తీసుకున్నవారేనని చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.