Ts News : రవీంద్ర భారతి ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు

రవీంద్ర భారతి ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ రద్దు చేసింది. కరోనా జాగ్రత్త చర్యల్లో భాగంగా నిర్ణయం తీసుకున్నట్లు

Updated : 02 Jan 2022 15:13 IST

హైదరాబాద్‌: రవీంద్ర భారతి ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ రద్దు చేసింది. కరోనా జాగ్రత్త చర్యల్లో భాగంగా నిర్ణయం తీసుకున్నట్లు  అధికారులు పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాలతో మూసివేస్తున్నట్లు తెలిపారు. ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈనెల 10 వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని