Cyclone Jawad: ప్రజలు నదులు దాటే ప్రయత్నం చేయొద్దు: శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌

జిల్లా వ్యాప్తంగా నిన్న మధ్యాహ్నం నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు నదులు దాటే ప్రయత్నం చేయొద్దని కలెక్టర్‌ శ్రీకేష్‌

Updated : 04 Dec 2021 12:39 IST

శ్రీకాకుళం: జిల్లా వ్యాప్తంగా నిన్న మధ్యాహ్నం నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు నదులు దాటే ప్రయత్నం చేయొద్దని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ సూచించారు. నదీపరివాహక, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తుపాను ప్రభావాన్ని ప్రత్యేక అధికారి అరుణ్‌కుమార్‌ సమీక్షిస్తున్నట్లు వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ చెప్పారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని తెలిపారు.

మరోవైపు తుపాను దృష్ట్యా విజయనగరం జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. పూసపాటిరేగ మండలంతో పాటు చేపలకంచేరు, పార్వతీపురానికి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు చేరుకున్నాయి. గజపతినగరం మండలంలో 161 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. జిల్లాలోని ఆండ్ర, తాడిపూడి జలాశయాల నుంచి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేశారు.

జవాద్‌ నేపథ్యంలో కాకినాడ ఉప్పాడ తీరంలో అలలు ఉద్ధృతంగా ఎగిసి పడుతున్నాయి. దీంతో ఉప్పాడ, కాకినాడ బీచ్‌రోడ్డు మీదుగా రాకపోకలు నిలిపేశౄరు. కాకినాడ కలెక్టరేట్‌, రంపచోడవరం ఐటీడీఏ, రాజమహేంద్రవరం సర్కిల్‌, 6 డివిజన్లలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

తూర్పు గోదావరి జిల్లాలో ఏడు రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. మత్య్సకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా తీరప్రాంత ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. ఏలూరు కలెక్టరేట్‌, ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నంబరు : 08942 240557,
పాలకొండ డివిజన్ (ఆర్డీవో) కంట్రోల్ రూం: 08941-260144, 9493341965

టెక్కలి డివిజన్ (ఆర్డీవో) కంట్రోల్ రూం : 08945-245188, 
శ్రీకాకుళం డివిజన్ (ఆర్డీవో) కంట్రోల్ రూం : 8333989270


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని