Cyclone Jawad: తప్పిన ముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు కదులుతున్న జవాద్
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విశాఖకు ఆగ్నేయంగా 200 కిలోమీటర్లు, గోపాల్ పూర్ కు 310 కి.మీ దూరంలో జవాద్ తుపాను కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ
అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విశాఖకు ఆగ్నేయంగా 200 కిలోమీటర్లు, గోపాల్ పూర్ కు 310 కి.మీ దూరంలో జవాద్ తుపాను కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చిన అనంతరం దిశ మార్చుకున్న తుపాను ప్రస్తుతం మందగమనంతో ఒడిశా వైపు కదులుతోందని వెల్లడించింది. గడచిన 6గంటలుగా ఇది గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్టు భారత వాతావరణ విభాగం తెలియజేసింది. కొద్ది గంటల్లోనే ఇది తీవ్ర వాయుగుండంగా బలహీనపడే సూచనలు ఉన్నట్టు ఐఎండీ తెలిపింది. ఇదే వేగంతో కదులుతూ రేపు మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ తీరానికి చేరువగా వెళ్లే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించింది. తదుపరి మరింత బలహీనపడి పశ్చిమ్ బెంగాల్ వైపుగా కదిలే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర తీరప్రాంతాల్లో గంటకు 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. రాగల 24 గంటల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని ఐఎండీ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్