Ap News: తిరుమ‌ల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఉన్నతాధికారుల సమక్షంలో ఆగమోక్తంగా ఆస్థాన వేడుకను బంగారువాకిలి...

Published : 04 Nov 2021 16:40 IST

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఉన్నతాధికారుల సమక్షంలో ఆగమోక్తంగా ఆస్థాన వేడుకను బంగారువాకిలి చెంత నిర్వహించారు. బంగారువాకిలి ముందున్న ఘంటా మండపంలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీమలయప్పస్వామివారు, శ్రీ విష్వక్సేనుల వారి ఉత్సవమూర్తులను గరుడాళ్వారు సన్నిధిలో అభిముఖంగా ఉంచి ఆస్థానం నిర్వహించారు. మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల మధ్య దీపావళి ఆస్థానం నిర్వహించారు. అంత‌కుముందు ఆల‌యంలో మూలవిరాట్టుకు, ఇతర దేవతా మూర్తులకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక హారతులు నివేదించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని