Bhadrachalam: ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు భక్తులకు అనుమతి నిరాకరణ

భద్రాచలం రాములోరి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు భక్తులకు అనుమతి లేదని భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్‌ వ్యాప్తి

Published : 06 Jan 2022 01:29 IST

భద్రాద్రి: భద్రాచలం రాములోరి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు భక్తులకు అనుమతి లేదని భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్‌ వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఉత్సవాల నిర్వహణలో భాగంగా ఆన్‌లైన్‌లో అమ్మిన టికెట్ల డబ్బులు భక్తులకు తిరిగి చెల్లించనున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు. ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 12న తెప్పోత్సవం, 13న ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. వేదపండితులు, అర్చకుల సమక్షంలో ఈ ఉత్సవాలు జరగనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని