Khairatabad Ganesh: ఖైరతాబాద్‌ గణేశుడి వద్ద సందడి.. గవర్నర్లు తొలిపూజ

తెలుగు రాష్ట్రాల్లో వినాయకచవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కొవిడ్‌ నిబంధనల మేరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

Published : 11 Sep 2021 02:39 IST

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో వినాయకచవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కొవిడ్‌ నిబంధనల మేరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రఖ్యాత ఖైరతాబాద్‌ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈసారి అక్కడ 40 అడుగులతో ‘పంచముఖ రుద్ర మహాగణపతి’ని ప్రతిష్ఠించారు. మహాగణపతికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తొలి పూజ నిర్వహించారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీగా భక్తులు తరలి వస్తుండటంతో ఖైరతాబాద్‌ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని