Srisailam: కార్తిక సోమవారం.. శ్రీశైలంలో భక్తుల రద్దీ

శ్రీశైలం మహాక్షేత్రంలో కార్తిక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కార్తిక మాసం

Updated : 08 Nov 2021 10:48 IST

శ్రీశైలం ఆలయం: శ్రీశైలం మహాక్షేత్రంలో కార్తిక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కార్తిక మాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల నుంచి అధికసంఖ్యలో భక్తులు శ్రీశైలానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి.. ఆలయ పురవీధుల్లో కార్తిక దీపారాధనలు చేశారు. అనంతరం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. మరోవైపు ఈరోజు సాయంత్రం ఆలయ పుష్కరిణి వద్ద జరగనున్న లక్ష దీపోత్సవానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని