
Updated : 26 Dec 2021 00:18 IST
Bharat Biotech: త్వరలో అందుబాటులోకిపిల్లల కొవిడ్ టీకా
హైదరాబాద్: త్వరలోనే చిన్నారులకు కొవిడ్ టీకా అందుబాటులోకి రానుంది. భారత్ బయోటెక్ కొవిడ్ టీకాకు డీసీజీఐ అనుమతి లభించింది. అత్యవసర వినియోగానికి భారత్ బయోటెక్‌కు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. 12 నుంచి 18 ఏళ్ల లోపు వయసుకలిగిన వారికి భారత్ బయోటెక్ కొవిడ్ టీకాను అభివృద్ధి చేసింది. పిల్లలు, పెద్దలకు ఒకే డోసు ఇచ్చేలా టీకాను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది. కొత్త వేరియంట్లపై కూడా సమర్థంగా పని చేస్తుందని.. పిల్లల్లోనూ కొవాగ్జిన్ అద్భుత ఫలితాలు ఇస్తోందని తెలిపింది.
Tags :