TS News: రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం: డీజీపీ మహేందర్‌రెడ్డి

కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు.

Updated : 30 Dec 2021 14:46 IST

హైదరాబాద్‌: కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. వేడుకలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని ఆయన ప్రజలను కోరారు. హైదరాబాద్‌లో మహేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌ నియంత్రణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధిస్తున్నట్లు చెప్పారు. జనవరి 2వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. పబ్‌లు, ఈవెంట్లలో ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని తెలిపారు.

కొవిడ్‌ నిబంధనలు అమలు చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చామని డీజీపీ వివరించారు. ఆరోగ్యశాఖ సూచనలను అమలు చేస్తామని చెప్పారు. విమానాశ్రయంలో కూడా పరీక్షలు చేసి ప్రభుత్వ ఆదేశాలు అమలు చేస్తామని వివరించారు. కొవిడ్‌ నిబంధనలను పోలీస్‌శాఖ కఠినంగా అమలు చేస్తుందని డీజీపీ వెల్లడించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని