Corona: కరోనా ఇంకా కనుమరుగుకాలేదు.. జాగ్రత్తలు తీసుకోండి: డీహెచ్‌

రానున్న మూడు నెలలు పండగల సీజన్‌ అని.. ప్రజలంతా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు ......

Updated : 11 Oct 2021 16:13 IST

హైదరాబాద్‌: రానున్న మూడు నెలలు పండగల సీజన్‌ అని.. ప్రజలంతా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు సూచించారు. కరోనా ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదని.. ఎవరికైనా లక్షణాలు ఉంటే తప్పకుండా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పండగల సీజన్‌లో షాపింగ్‌లు, విందులకు వెళ్లేవాళ్లు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. ప్రతిఒక్కరూ మాస్క్‌ ధరించాలన్నారు. వైరస్‌ పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కుటుంబంలో అందరికీ సోకుతుందని.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు