వారి పెళ్లి ఖర్చు రూ.500..!
ధార్: సాధారణంగా పెళ్ళంటే గుర్తుకొచ్చేది బాజాభజంత్రీలు, బంధుమిత్రుల సందడి, నోరూరించే వంటకాలు, ఇంకా మరెన్నో. జీవితంలో ఒకేసారి చేసుకునే ఈ అపురూప వేడుక కోసం ఈ రోజుల్లో రూ.కోట్లలో ఖర్చు చేసేవారూ ఉన్నారు. కానీ ఓ జంట కరోనా నిబంధనలు పాటిస్తూ నిరాడంబరంగా పెళ్లి చేసుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. అయితే వారి పెళ్లికి అయిన ఖర్చు రూ.500 మాత్రమే.
మధ్యప్రదేశ్‌లోని ధార్ కలెక్టర్ శివాంగి జోషి.. భారత సైన్యంలో మేజర్‌గా పనిచేస్తున్న అంకిత్ చతుర్వేది వివాహం చేసుకోవాలనుకున్నారు. వారిద్దరూ భోపాల్‌కు చెందినవారు. రెండేళ్ల క్రితమే వారి వివాహం నిశ్చయమైంది. కానీ కొవిడ్ మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి వైరస్ కట్టడికి సంబంధించిన విధుల్లో ఆమె నిమగ్నమయ్యారు. దీంతో వారి పెళ్లి వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో విలాసవంతమైన వివాహ వేడుకలకు డబ్బు ఖర్చు చేయొద్దంటూ సమాజానికి సందేశం పంపేందుకు వారు కోర్టులో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అందుకోసం తమ తల్లిదండ్రుల అనుమతి కూడా తీసుకున్నారు. కోర్టులో రూ.500 చెల్లించి వివాహం చేసుకున్నారు. వారి పెళ్లి వేడుకకు పూల దండలు, మిఠాయిలు మాత్రమే ఏర్పాటు చేశారు. అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈ వేడుకకు వధూవరుల కుటుంబసభ్యులు, పరిమిత సంఖ్యలో సహోద్యోగులు హాజరయ్యారు.
‘‘పెళ్లి పేరుతో అనవసరంగా డబ్బు ఖర్చు చేయొద్దనే నేను ఇలా నిరాడంబరంగా వివాహం చేసుకున్నాను. పెళ్లి ఖర్చుతో వధువు కుటుంబంపై ఆర్థికంగా అదనపు భారం పడుతుంది. వేడుకలను ఘనంగా నిర్వహించడం.. కష్టపడి సంపాదించిన సొమ్మును వృథా చేయడమే అవుతుంది’’ అని శివాంగి జోషి తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Pani Puri: పానీపూరీ తిని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.. 100 మందికిపైగా అస్వస్థత!
-
Technology News
Xiaomi Mix Fold 2: షావోమి మడత ఫోన్, హ్యుమనాయిడ్ రోబోట్ చూశారా?
-
Sports News
Washington Sundar: వాషింగ్టన్ సుందర్‌కు గాయం.. జింబాబ్వే పర్యటనకు అనుమానమే..!
-
Movies News
Arun Vijay: వారి మధ్య ఐక్యత లేకపోవడం వల్లే కోలీవుడ్ నష్టపోతోంది: అరుణ్ విజయ్
-
India News
Freebies: వాటిపై నిజమైన చర్చ జరగాలి.. కేజ్రీవాల్‌కు నిర్మలా సీతారామన్ కౌంటర్
-
Movies News
Kajal Aggarwal: ‘బాహుబలి’ కట్టప్పగా మారిన కాజల్.. ప్రభాస్‌గా ఎవరంటే?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Shashi Tharoor: శశిథరూర్‌కి ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం
- Crime News: కోడలి తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన అత్త
- Arun Vijay: వారి మధ్య ఐక్యత లేకపోవడం వల్లే కోలీవుడ్ నష్టపోతోంది: అరుణ్ విజయ్
- Andhra News: ఎంపీ కేశినేని నాని పిటిషన్‌కు విచారణ అర్హత ఉంది: ఏపీ హైకోర్టు
- Pani Puri: పానీపూరీ తిని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.. 100 మందికిపైగా అస్వస్థత!
- Cricket News: జింబాబ్వేతో వన్డే సిరీస్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్
- EPF: పీఎఫ్ ఖాతాలో చందాను సంస్థ జమ చేయకపోతే..?
- Lal Singh Chaddha: రివ్యూ: లాల్ సింగ్ చడ్డా
- Sita Ramam: ‘సీతారామం’తో మరో సినిమా చేస్తాం: హను రాఘవపూడి
- Prudhvi Raj: ఇంత దౌర్భాగ్యం ఎప్పుడూ చూసి ఉండం.. మాధవ్ వీడియోపై పృథ్వీరాజ్ కామెంట్