
TS News: కొవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలు కొనసాగుతాయి: మంత్రి సబిత
హైదరాబాద్: కొవిడ్ తీవ్రత కారణంగా విద్యాసంస్థలు మూసివేయాలని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలు కొనసాగించాలని ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. విద్యా సంస్థలపై తప్పుడు ప్రచారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మవద్దవని ఆమె కోరారు. కరోనా వ్యాప్తి కట్టడికి విద్యాంస్థల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.