Dollar Seshadri: ప్రముఖులు తిరుమల వస్తే డాలర్‌ శేషాద్రి ఉండాల్సిందే..

తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి మరణంతో తితిదే వర్గాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

Updated : 29 Nov 2021 10:51 IST

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి మరణంతో తితిదే వర్గాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. స్వామివారికి నిత్యం జరిగే కైంకర్యాలు, ఆలయ సంప్రదాయాలపై ఆయనకు మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో ఆలయంలో డాలర్‌ శేషాద్రి సేవలను తితిదే సిబ్బంది, అధికారులు గుర్తు చేసుకుంటున్నారు. 2007లో ఉద్యోగ విరమణ చేసినప్పటికీ ఆయనకున్న విశేషానుభవం దృష్ట్యా తిరుమల ఆలయ ఓఎస్డీగా తితిదే కొనసాగిస్తోంది. 

మరోవైపు ప్రముఖులు ఎవరైనా తిరుమల వస్తే డాలర్‌ శేషాద్రి కచ్చితంగా అక్కడ ఉండేవారు. 1978 నుంచి తితిదే వ్యవహారాల్లో ఉండటంతో ఎంతోమంది రాష్ట్రపతులు, ప్రధానులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, పారిశ్రామికవేత్తలు శ్రీవారి దర్శనానికి వస్తే ఆయన దగ్గరుండి కార్యక్రమాలను పర్యవేక్షించేవారు. అప్పటి రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్‌, ప్రధానులు పీవీ నరసింహారావు, వాజ్‌పేయీ, మన్మోహన్‌సింగ్‌, నరేంద్ర మోదీ.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌, చంద్రబాబు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు వారితో డాలర్‌ శేషాద్రి అక్కడ కనిపించేవారు. 

మరిన్ని ఫొటోల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని